నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, June 27, 2012

కఠిన శిల


                                          మెత్తటి పూల ఉసురెందుకు 
                                           కఠిన శిలను కొలిచేందుకు 

Tuesday, June 12, 2012

నా కలల తీరం


                                                తీరంపైకి  అలల ముట్టడి 
                                           ఎప్పటికి నిన్ను గెలవలేని నా లా

Tuesday, June 5, 2012

చీకటి , వెలుగుల దోబూచులాటచీకటిని చింపేశాడు
 అల్లరి సూరీడు 
తన కిరణాలతో
 చక్కలిగిన్తలేట్టేస్తున్నాడు 

నిరాశలో ఉన్న చీకటికి 
వుత్తేజాన్నిచ్చాడు 
ఓడిపోయి ఒంటరిగా ఉన్న చీకటికి 
నేనున్నానని అభయాన్నిచ్చాడు

వెన్నెలలోని మసకలే
 జీవితం కాదని 
వెలుగు లోకం వుందని
తేల్చి చెప్పాడు 
తప్పులన్నీ తనలో 
జరుగుతున్నాయి అని 
తల్లడిల్లే నిశికి తన 
వెలుగుతో విముక్తి ఇచ్చాడు 

సమస్త జనావళిని తన 
అజ్ఞాన  నిద్రలో ముంచెత్తే చీకటి ని 
తన వెలుగు కిరణాల తో 
అజ్ఞానాన్ని తోలేసాడు సూరీడు 
నల్లరంగు తనకుందని 
కుమిలి పోతున్న చీకటికి 
తన వెలుగు రంగును 
తొడిగాడు సూరీడు.....
ఇదే చీకటి , వెలుగుల దోబూచులాట 

Monday, June 4, 2012

మనసు వ్యాపారం


                                              మనిషి మారిపోయాడు 
                                     వ్యాపారం ఇప్పుడు మనసుతో చేస్తున్నాడుమనసు బాధ
                                                    
                                            తొక్కే పాదానికి ఏమి తెల్సు   
                                    నలిగి పోయే పువ్వు బాధ 
                                     

నువ్వు -- నా మనసునువ్వు గుచ్చి వెళ్ళిపోయిన నా మనసులో
మిగిలింది  రక్తం తో తడిసిన నా ప్రేమ  గులాబీ 
చిద్రమైపోయింది నిన్ను దేవతగా చేసుకున్న నా మనసు మందిరం 
చిగురుటాకు పెనుగాలికి వణికినట్టు అల్లాడిపోయింది  నా మనసు 
ఎవరికీ చెప్పినా తీరని వ్యధ నా కధ
నా రెండు కళ్ళు వర్షిస్తున్నాయి నీళ్ళతో కాదు రక్తం తో 
తొక్కే పాదానికి ఏమి తెలుసు నలిగిపోయే పువ్వు బాధ 
నా మనసు బాధ నీకు  ఎలా తెలుస్తుంది 
ఇష్టపడి  తెచ్చుకున్న నా మనసు మదిరంలోకి నీ ప్రేమను 
కూకటి వేళ్ళతో పెకిలించి పోయావ్ చెప్పకుండా తీసుకు పోయావ్ కనీసం 
నీతో ప్రేమసరాగాలు ఆలపించాలని ఆశ పడ్డాను 
కాని అపస్వరాలు నేర్పి వెళ్లి పోయావ్ 
నీరులేని సాగరం అయిపోయింది నా మనసు 
నీరంతా తీసుకెళ్ళి ఇసకను మిగిల్చావ్ మాడి పొమ్మని 
ఆశలతో విరబూసిన నా ప్రేమ వృక్షాన్ని 
ఆశలన్నీ రాల్చేసి రాకాసి  వయ్యావు
నిర్దయగా,నిరంకుశంగా , నా నిర్ణయం తో పనిలేకుండా వెళ్లిపోయావ్
నా ప్రేమ మళ్లీ చిగురిస్తుందన్న నమ్మకం లేదు నువ్వు చేసి వెళ్ళిన 
గాయం సాక్షి గా...............................................

Saturday, June 2, 2012

నా మనసు విహారం


                                          నా  మనసు  విహరిస్తుంది 
                                           నీ మనసు నందనవనం లో 
                                                                              

మరీచికే మేలు నీకంటే


మరీచికే మేలు నీకంటే 
దూరం నుంచి మురిపించి 
దరికి రాగానే  మాయమవుతుంది, నీలానే 
నువ్వేమో ,చూస్తావు 
మురిపిస్తావ్,మైమరిపిస్తావ్ 
కాని అందకుండా అందలమేక్కేస్తావ్ 
బుంగ మూతితో బెంగ తెప్పిస్తావ్ 
వాలు జడ తో వలపులు నింపుతావ్ 
ఇక నీ పరికిణి పనేమీ లేదు నా గుండె పిండి ఆరేస్తుంది 
నిన్ను చుసిన క్షణం లోనే నా గుండె తడారి పోతుంది 
ఎందుకంటే అప్పుడు నువ్వు నా వైపే చూస్తూవుంటావ్ 
ఇదంతా చూసి నువ్వంటే భయం అనుకునేవ్ అమ్మాయ్
ఏదో మనసు పడ్డాను కదా అని అభిమానం 
నీ బెట్టు మాత్రం ఎంతకాలం లే ఆ మూడు ముళ్ళు పడేంత వరకేగా 
ఆ ఘడియ కోసం ఎదురు చూస్తూ నీ ఎండమావి ఊహల్లో 
నీ కై వేచి వుండే నీ ప్రియ సఖుడు 

ప్రేమలేఖఆ మాధుర్యమే వేరు 
నా చెలి చేతులతో రాసిన ప్రేమలేఖ 
నా చేతి కందిన క్షణం ..............
తను రాసిన అక్షరాల్ని తడిమితే 
తననే తాకిన అనుభూతి వర్ణనాతీతం 
తను నా పై కురిపించే ప్రేమావేశం అద్బుతం 
తను రాసిన లేఖ అందుకోవాలనే తాపత్రయం 
నన్ను నిలవ నిచ్చేదే  కాదు
తను తిట్టినా, తన బాధలు పంచుకున్న ఆ తియ్యన్దనమే వేరు 
నేను తను మళ్లి మా లేఖల కోసం ఎదురుచూపులు 
ఆ చిత్రమైన జీవితం ఇక రాదు 
ఎసెమెస్,చాట్ ,లైక్ లు ప్రేమలేఖలను ఆర్పేసాయి
ఇప్పుడు ప్రేమలేఖ రాస్తే నేరం నా చెలి దృష్టిలో 
ఎక్కడో ఎవరో రాసిన డాక్ ని కాపి చేస్తే గొప్ప 
పేస్ బుక్ లో పిక్ పెడితే అదో అద్బుతం 
తను రాసిన మెసేజ్ కి కామెంట్ పెడితే ప్రేమ వున్నట్టు 
కామెంట్ పెడితే ఒక హాగ్ ఉచితమే 
ఇంకా ఇంకా చెప్పు అని సాగతీతలు
నా మెసేజ్ బాలన్సు నిల్ రా అని గోముగా గోకటం 
ఇన్ని ఎలాక్ట్రానిక్ పరికరాలు,కృత్రిమ బంధాల మధ్య 
మనసు నలిగి పోతుంది,ఉండచుట్టి విసిరేసిన 
ప్రేమలేఖలా.......................

నీ ప్రేమలో !నువ్వు ఆక్రమించాకే తెల్సింది 
నాకు ఒక మనసుంది అని
నువ్వు నవ్వాకే తెల్సింది 
నా మనసు నవ్వుతుంది అని 
నీ చూపు తగిలితేనే తెలిసింది 
మనసుకి చూపులు గుచ్చుకుంటాయి అని 
నీ స్పర్శ ద్వారానే  తెలిసింది 
నా మనసు పులకిస్తుంది అని 
నీ తేనే పలుకు వలన తెలిసింది 
నా మనసు కి  ఊహాశక్తి వుంది అని 
నీ మేని పరిమళం తెలిపింది 
నా మనసు కి ఆహ్లాదం 
నీ వేలితో ముంగురుల ఆట 
నా మనసుకి గిలిగింత నేర్పింది 
నీ కాలి అందెల సవ్వడి 
నా మనసుకి స్పందన నేర్పింది 
నీ ప్రేమ పరిష్వంగం లో 
నిన్ను ప్రేమించడం తెలుసుకుంటుంది 
ఇప్పటికి.......ఎప్పటికి 

అమ్మ మనసు


వేయి గునపాలు గుచ్చిన బాద 
నిన్ని కన్న సమయంలో 
లక్ష గొంతుకల మోత నా ఆర్తనాదం లో 
సూదంటు రాయిని గుండెలో  గుచ్చిన బాధ 
ఒక్కసారిగా నీ ఏడుపు  వినపడింది 
నా మనసులో కోటి వీణలు మోగాయి 
నొప్పి,బాధ మటుమాయం 
నీ ముద్దు మోము,నీ నవ్వు నాకు హాయినిచ్చాయి 
నీ ఎదుగుదల నా ఎదుగుదలగా భావించా
నీ గెలుపు  నా గెలుపే అని మురిసి పోయా 
నీ ఆకలి  కోసం నా వంటలో అమృతం కలిపి వండాను 
నీ చిన్ని చిన్ని నేరాలు ఎన్నో నా మీద వేసుకున్నాను 
నీ భాగస్వామి కోసం నా భాగస్వామి తో ఎన్నో మాటలు పడ్డాను 
నీకోసమే కేవలం నీకోసమే ఎందుకంటే నువ్వు నా ప్రాణం 
నీకు మాత్రం నేనో చిరాకు..................
వయసుమళ్ళిన చాదస్తం 
నోరుమూసుకోమనే హక్కు నీకొచ్చేసింది 
ఒక్క పూట తిన్నావా అమ్మ అని అడగడానికి 
నీకు అహం అడ్డొస్తోంది
నీ ఇంట్లో పనిచేయాలి నీకు ఖర్చులేకుండా పనిమనిషిలా 
నీకు బాధ కలగకుండా చూసుకోవాలి బానిసలా 
అన్ని సమయానికి సమకూర్చాలి సమిధను అవుతూ 
నేను ఆసుపత్రి అంటే నీకు ఆఫీసులో పని పెరుగుతుంది 
నాకు జబ్బు చేస్తే నీకు స్టోర్ రూం గుర్తొస్తుంది 
నీ పిల్లలకు నేనొక ఆయా,నీకు లేదు నా మీద దయ 
నాకు ఓర్చుకునే ఓపిక ఇచ్చాడు ఆ దేముడు 
కాని నువ్వు జాగ్రత బిడ్డ,భవిష్యత్ మనదికాదేమో 
నిన్ను శపించే మనసుకాదు నాది 
కాని తస్మాత్ జాగర్త బిడ్డ 

గతం

                                                           
                                               నీకు కావాల్సింది నీకిస్తాను 
                                                నా గతం నాకివ్వగలవా
                                                                                        

స్వేచ్చనివ్వు నీ నవ్వు కి


                                               ఓసారి వదలవా నాకోసం 
                                         నీ పెదాల్లో బంధించిన చిరునవ్వుని 
                                                                                 

నువ్వే నా కంటి పాప


                                           కలైతే మాయంఅవుతావని 
                                       కంటిపాపగా మార్చుకున్నాను నిన్ను