నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, June 2, 2012

అమ్మ మనసు


వేయి గునపాలు గుచ్చిన బాద 
నిన్ని కన్న సమయంలో 
లక్ష గొంతుకల మోత నా ఆర్తనాదం లో 
సూదంటు రాయిని గుండెలో  గుచ్చిన బాధ 
ఒక్కసారిగా నీ ఏడుపు  వినపడింది 
నా మనసులో కోటి వీణలు మోగాయి 
నొప్పి,బాధ మటుమాయం 
నీ ముద్దు మోము,నీ నవ్వు నాకు హాయినిచ్చాయి 
నీ ఎదుగుదల నా ఎదుగుదలగా భావించా
నీ గెలుపు  నా గెలుపే అని మురిసి పోయా 
నీ ఆకలి  కోసం నా వంటలో అమృతం కలిపి వండాను 
నీ చిన్ని చిన్ని నేరాలు ఎన్నో నా మీద వేసుకున్నాను 
నీ భాగస్వామి కోసం నా భాగస్వామి తో ఎన్నో మాటలు పడ్డాను 
నీకోసమే కేవలం నీకోసమే ఎందుకంటే నువ్వు నా ప్రాణం 
నీకు మాత్రం నేనో చిరాకు..................
వయసుమళ్ళిన చాదస్తం 
నోరుమూసుకోమనే హక్కు నీకొచ్చేసింది 
ఒక్క పూట తిన్నావా అమ్మ అని అడగడానికి 
నీకు అహం అడ్డొస్తోంది
నీ ఇంట్లో పనిచేయాలి నీకు ఖర్చులేకుండా పనిమనిషిలా 
నీకు బాధ కలగకుండా చూసుకోవాలి బానిసలా 
అన్ని సమయానికి సమకూర్చాలి సమిధను అవుతూ 
నేను ఆసుపత్రి అంటే నీకు ఆఫీసులో పని పెరుగుతుంది 
నాకు జబ్బు చేస్తే నీకు స్టోర్ రూం గుర్తొస్తుంది 
నీ పిల్లలకు నేనొక ఆయా,నీకు లేదు నా మీద దయ 
నాకు ఓర్చుకునే ఓపిక ఇచ్చాడు ఆ దేముడు 
కాని నువ్వు జాగ్రత బిడ్డ,భవిష్యత్ మనదికాదేమో 
నిన్ను శపించే మనసుకాదు నాది 
కాని తస్మాత్ జాగర్త బిడ్డ 

No comments:

Post a Comment