నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, June 2, 2012

ప్రేమలేఖ



ఆ మాధుర్యమే వేరు 
నా చెలి చేతులతో రాసిన ప్రేమలేఖ 
నా చేతి కందిన క్షణం ..............
తను రాసిన అక్షరాల్ని తడిమితే 
తననే తాకిన అనుభూతి వర్ణనాతీతం 
తను నా పై కురిపించే ప్రేమావేశం అద్బుతం 
తను రాసిన లేఖ అందుకోవాలనే తాపత్రయం 
నన్ను నిలవ నిచ్చేదే  కాదు
తను తిట్టినా, తన బాధలు పంచుకున్న ఆ తియ్యన్దనమే వేరు 
నేను తను మళ్లి మా లేఖల కోసం ఎదురుచూపులు 
ఆ చిత్రమైన జీవితం ఇక రాదు 
ఎసెమెస్,చాట్ ,లైక్ లు ప్రేమలేఖలను ఆర్పేసాయి
ఇప్పుడు ప్రేమలేఖ రాస్తే నేరం నా చెలి దృష్టిలో 
ఎక్కడో ఎవరో రాసిన డాక్ ని కాపి చేస్తే గొప్ప 
పేస్ బుక్ లో పిక్ పెడితే అదో అద్బుతం 
తను రాసిన మెసేజ్ కి కామెంట్ పెడితే ప్రేమ వున్నట్టు 
కామెంట్ పెడితే ఒక హాగ్ ఉచితమే 
ఇంకా ఇంకా చెప్పు అని సాగతీతలు
నా మెసేజ్ బాలన్సు నిల్ రా అని గోముగా గోకటం 
ఇన్ని ఎలాక్ట్రానిక్ పరికరాలు,కృత్రిమ బంధాల మధ్య 
మనసు నలిగి పోతుంది,ఉండచుట్టి విసిరేసిన 
ప్రేమలేఖలా.......................

1 comment:

  1. ఎన్ని వచ్చినా లేఖల సాటి ఎన్నటికీ రావు. కృత్రిమాన్నే నిజమనుకుని భ్రమలో బ్రతికే వారి గురించి బాగా వ్రాశారు.

    ReplyDelete