నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, July 31, 2012

ఇల్లాలురోజంతా తెగ తిరిగేస్తాను 
గాలిలో ధూళిలో 
ఈ చెడ్డ లోకం లో 
అన్నింటా అబద్దమే

తిండి సంపాదించుకోవడానికి
డబ్బు సంపాదించుకోవడానికి
హోదా సంపాదించుకోవడానికి
అన్ని పాపాలే చేసేది

కాని చీకటిని చూస్తె భయం
చీకటి పడితే ఇంటికి వెళ్ళాలి
ఇంటికి వెళితే అక్కడ అర్ధాంగి వుంటుంది
అదేంటో నేను చేసే పాపాలన్నీ
ఆమె కంటి చూపు లో చక్కగా కనబడతాయి
నా మోసాలు అన్ని వేషాలు వేసుకుని
నన్ను చూసి నవ్వుతాయి

బాద పడుతున్న తన గుండె లోని బాధ
కంటి ద్వారా నన్ను ప్రశ్నిస్తుంటే
జవాబు చెప్పలేని నా చేతకాని తనం
వెర్రి చూపులు చూస్తుంటుంది రోజు
అందుకే భయం చీకటంటే

తను విసిరి కొట్టిన నా చేయి
కసురుకునే నా హృదయం
ఆలోచిస్తున్నా ఎందుకు ఇలాగా అని
అప్పుడే తెలిసింది

తను వెలిగించింది నా ఇంటి దీపం అని
ఆ వెలుగులో నా తప్పులన్నీ
తను చూడగలదు అని
అందుకే ఇల్లాలే ఇంటికి వెలుగు
ఆ వెలుగున్నంత కాలం నేను
ఏ తప్పు చేయను చేయలేనేమో
వెంటాడుతూనే వుంటుంది
నేను బతికున్నంత కాలం

Saturday, July 28, 2012

జీవితం ఒక ప్రయాణం

రైలు బండి  బయలు దేరింది 
ఎంతో మంది జనాలు 
అందరివి వేరు వేరు ఆలోచనలు 
వృత్తులు, ప్రవృత్తులు 
అందులో నేను ఒకడిని 

కిటికీ లోనుంచి అందమయిన దృశ్యాలు 
అప్పుడే చీకట్లోనుంచి వస్తున్న సూరీడు  
పిలిచిన గాలి ని  తలవూపి పలకరించే పైర్లు 
అప్పుడప్పుడు చుట్టాల్లా వచ్చి పలకరించే 
పోయే స్టేషన్లు 
కోనసీమ అందాలు కన్నెపిల్లను 
జ్ఞప్తికి తెచ్చేస్తున్నాయి 

అప్పుడప్పుడు కళ్ళు ముసేసా 
తలదిన్చేసా రైలు కట్ట పక్కన 
నిలబడ్డ భారత స్త్రీ  జాతిని చూసి 
ఎదిగిన దేశ భవిత ఇంతేనా అని 

ఇవేమీ తనకి పట్టనట్టు 
నిండు  పుష్పక విమానం లా  పోతూనే వుంది రైలు 
వందల జీవితాలను తన చక్రాలపై మోస్తూ 
పాత ప్రయాణీకులను దింపేస్తూ 
కొత్తవారిని తనలోకి ఆహ్వానిస్తూ 
జీవితమూ  ఇంతేనేమో 
అన్ని చూసేస్తుంది , చూపిస్తుంది 
మళ్లీ తన యాత్ర తానూ చేస్తూనే వుంటుంది   

గోదారి గలగల లను గుండె నిండా నింపుకుని 
కోనసీమ తీపి జ్ఞాపకాలను మూటకట్టుకుని 
మళ్లీ రైలెక్కాను అదే అనుభూతి 
మారదేమో అది నా జీవితం లానే 
జీవితం ఒక ప్రయాణం 


పువ్వుల భాష


                                           పువ్వుల భాష నేర్చుకుంటున్నా
                                      విరిసినా,వాడినా మౌనంగా ఉండేందుకు 

ఉషోదయ నర్తనం


                                             నా నిశి యవనికపై 
                                             నీ ఉషోదయ నర్తనం 

Monday, July 23, 2012

దేశ భక్తి

హే డూడ్ విల్ యు  హెల్ప్ మీ ఫర్ థిస్ 
ఓహ్ ష్యూర్ బ్రో, బట్ వాట్ ఇస్ థిస్ 
యు డోంట్ నో  ఇది మన కంట్రీ  ఫ్లాగ్ 
 హో సారీ బ్రో చూడలేదు అవును కదూ

ఏంటి ఇలా నలిగి పోయింది పాతదా ఇది 
అవును ఎప్పుడో అరవయ్యేళ్ళు  నిండాయి 
అరె కలర్ కూడా మారింది బ్రో 
మారదా మరి ఒకరా ఇద్దరా 
ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోక్కేస్తే, ఎవరు?
ఎవరా ? మనోళ్ళే మన నాయకులే 

అప్పుడెప్పుడో భోఫోర్సు ,యూరియా 
గడ్డి కూడా తినేశారు ,టెక్నాలజీ 
పెరిగింది గా ఇప్పుడు టూ జి అంటా 
బెయిలు కి వంద కోట్లు డీల్ 
భారత దేశం ఎదిగిపోయింది 
జాతీయ జెండా నలిగి పోయింది 

వారసుల రాజకీయం 
మంత్రుల తంత్రాలు 
తెల్లోడే నయం తోలేతీసాడు కొరడాతో 
ఈ నల్లోళ్ళు  ప్రాణాలే తీసేస్తున్నారు 

నియంతే నయం స్వేచ్చకంటే 
తుపాకీయే నయం హితబోధకంటే 
ప్రజలకి కాదు, మన నాయకులకి 

నిజమా బ్రో ......................?
అమెరికా డాలర్ల మత్తులో 
చదువుకున్న యువత 
ఇక్కడున్న వాళ్ళేమి దేశ భక్తులు కారు 
ఐతే రేవ్ పార్టీ లేదా పబ్బు మందు
మిగిలిన  వాళ్ళు మామూలే దేశాన్ని 
నాయకులని తిట్టుకుంటూ 

మనం ఏమి చేయలేమా బ్రో 
లేదు, మార్పు  రావాలనే  వాళ్ళే  అందరు 
అందుకు సహకరించే వారు ఎందరు 
దేశాన్ని మింగేస్తుంటే ఏమి చేయలేకున్నాం 
దేశ భక్తిని, జాతీయ జండాని గౌరవిద్దాం 
దేశం ఉనికి కాపాడుదాం 

ఎదగాలనే ఆరాటం

  
ఎక్కడికో ఎదగాలనే ఆరాటం 
ఎందరికో స్ఫూర్తి నీ ప్రయత్నం 
తీరం పైకి నీ దండయాత్ర అలుపెరుగని 
యోధుడిలా
తీరం అందలేదని ఆవేశపడకు 
నింగి దొరకలేదని తొందరపడకు 
నీటి అణువులన్నీపోగేసి సైన్యం గాచేసి
నువ్వు చేసే నిరంతర యుద్ధం
మానవాళికి నిరంతర పాఠం
సమస్యను ఎదురుకునేందుకు
ఆకాశమే నీ హద్దు దాన్ని ఎప్పుడు చెరపొద్దు
సాగిపో విహంగమై నింగిదాక
చేరుకుంటావు నీ తీరం అనే ప్రేయసిని
నీ నిరంతర అలల ముట్టడిలో

పూల కన్నీరు


                                  పూల కన్నీరు అత్తరై గుభాళిస్తుంది 

ప్రతి కవి మండుతున్న రవి

ఒక స్వాప్నికుడు స్వప్నిస్తే గతంలో 
అది సాకారం అవుతుంది వర్తమానం లో 
ఎందరో కవులు శ్రమించి పరిచిన ఎర్రటి తివాచీపై 
ఈనాడు మనం హుందాగా నడుస్తున్నాం 
స్మరిద్దాం వారిని ఓసారి గతానికి వెళ్లి 
తవ్వుకుందాం మన మూలాలను వేర్ల కోసం 

అరిగో వారే తెలుగు దిగ్గజ కవులు కవిత్రయం 
తెలుగు భాష కవితకు బాటలు వేసిన సారధులు 
చంపకమాల,ఉత్పలమాల,మత్తేభం,శార్దూలం తో కవిత 
భవనాలు కట్టిన కవితా శ్రామికులు 
సంస్క్రుతాంద్ర పండితులు, తెలుగు మహాభారత శిల్పులు 

అదిగో రాయలు తెలుగు లెస్సని పలికిన రేడు 
అష్టదిగ్గజాలు మన జాతి రత్నాలు 
తెలుగు సుగంధాన్ని సాహితీ పొలంలో చల్లిన కర్షకులు 

ఆ వినిపించేవి శ్రీనాధ కవి చాటువులు, శివగీతికలు 
సరస సల్లాపాల సరిగమలు 
బమ్మెరపోతన కృష్ణ లీలామృతం పరవశం
అద్బుతం ,అసమాన్యం 

అడుగో ఆద్యాత్మిక గీతాల అన్నయ్య అన్నమయ్య 
వేంకటేశుని పొగిడి పోగిడిన్చుకున్న భక్త ప్రవీణ 
రామదాసు భజన కృతులు
తెలుగు నాట పండిన వరి కంకులు 

ఆయన వేమన విన్నావా ఆయన మాట 
తేనెల వరాలమూట,గొప్ప తత్వవేత్త 
మనవ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త 
ఆ మెరిసేవే సుభాషితాలు 
మీకు లేదా సుమతీ శతక కారుడు పెట్టిన వాత 

ఆ ఎగిరేది జాషువా గబిలం ప్రశ్నిస్తుంది 
విశ్వనరుడు ఎక్కడా అని, సమాధానం తెలుసా?
ఆ వేయి పడగల నీడ విశ్వనాదునిది 
ఆ నీడలోకి వెళ్తే చాలు కవిత్వం ఆవాహం అవుతుంది 

అదిగో మెరుపు జ్వలిస్తుందే అక్కడే పుట్టింది 
మానవ పిడుగు శ్రీ శ్రీ, ధైర్యం వుంటే పలకరించు 
లేకుంటే అనుసరించు మౌనంగా 
ఆ విశాల "మైదానం" యజమాని చలం 
మనవ సంబంధాలు వలయంలోనుంచి 
బయటకే రాము అందులోకి వెళితే 

ఇది గురజాడ నడిచిన బాట 
ఇది బోయిభీమన్న మాట 
అడివి బాపిరాజు నవల 
శేసెన్ గారి కవితా సుగంధం ఓ పట్టాన వదలవు 

ఇవి భావుకత చివుళ్ళు వీటి రుచి తెలియాలి అంటే 
దేవులపల్లి కృష్ణ శాస్త్రిని అడుగు వివరిస్తాడు 

ఈ విశ్వం పుట్టుక మూలాలు తెలుసా, సినారె 
విశ్వంభర చదువు, పదం పదం కలిపి కదం తొక్కి 
ముందుకు నడుపుతాయి తెలుసుకునేందుకు 

ఒక నక్షత్రం ఆరుద్ర , ఒకభావం ఆత్రేయ 
ఒక కొంటెతనం వేటూరి 
ఆచంద్రార్కం వెలిగే తారాలోకపు కవి పుంగవులు 

రాలే ఆకు రాలుతుంది నూతన చిగురు వచ్చేందుకు 
రాలే ప్రతీ ఆకును గౌరవించాలి వచ్చే చిగురు 
ప్రతి కవి మండుతున్న రవి అది ఆనాడైనా 
ఈ నాడైనా ఏనాడైనా —

Friday, July 13, 2012

శిక్ష

                                                     భరించలేని శిక్ష 
                                నువ్వు నాతొ లేని వొంటరితనం 

ఏమి బాలేదు

                                          ఏంటో ఒంటరితనం అంట 
                                        నువ్వు లేకుండా ఏమి బాలేదు 

కట్న దాహం

                                  తోరణాలే ఇంకా వాడలేదు 
                                ఇంటికొచ్చిన దీపం ఆరింది కట్నం గాలికి 

నీతలపుల నాట్యం


                                   పిచ్చి అంటున్నారు పిచ్చివాళ్ళు
                                   నీ తలపులతో నేను నాట్యం చేస్తుంటే 

Wednesday, July 11, 2012

నీ గుండెలో చోటిస్తావని

                                       నీ గుండె  గుమ్మంలో కాపలా 
                                      కరుణించి కాస్త నీ గుండెలో చోటిస్తావని 

నా ప్రేమకు నీ మనసు కొమ్మ


                                   రెక్కలొచ్చిన నా ప్రేమకు 
                                    సేద తీర్చింది నీ మనసు కొమ్మ 

ప్రాణం నువ్వే

                                        ప్రాణం పోవడం అంటే ఇదా 
                                       నువెళ్ళిపోతుంటే  తెలిసొచ్చింది 

సృష్టి కార్యం

ఒక శూన్యం వివస్త్రగా 
రంగులేమీ నింపుకొని లోకం 
అమాయకంగా వుంది 
నిశబ్దం లోనుంచి లేచిన ఒక చేయి 
లోకాన్ని నిమిరింది ,రెండుగా చేసింది 
భూమి, ఆకాశం అని పేరు పెట్టింది 

అంతా చీకటి బిలం,ఎక్కడ కూడాలేదు
ఎగిరేందుకు ఒక్క గబ్బిలం 
ఈసారి నోరు మాట్లాడింది 
చీకటిని చింపి వేరుచేసి లోకానికి 
వెలుగు పంచింది 

అక్కడనుండి ప్రతీరోజు ఒక చర్య
నీరు, గాలి,సూర్య చంద్రులు
తారలు ,తారాలోకం
ఎన్నో ప్రాణులు ,మరెన్నో జీవులు
చెట్టులు,పుట్టలు ,పంచ భూతాలూ 


ఇప్పుడు అంతా ప్రక్రుతి మయం
అంతలోనే ఎంత మార్పు
ఏడు రోజుల్లో ఎన్నో వింతలు
ఇదంతా ఎవరికోసం అనుకుంది
ఆ మనసు అంతే
ఒక సృష్టి కి అసలైన ఆరంభం ఇక్కడే
మట్టి మెత్తగా ఆ చేతుల్లో ఒదిగింది
తన రూపం ఇంకో రూపానికి
మూలం అవుతుంది అని 


ఆ రూపం ఒక దివ్యస్వరూపాన్ని పోలివుంది
ఇప్పటికి ఆ మట్టి ఒక మట్టి ముద్దే
తన ఆత్మను అందులోకి ఊదింది
ప్రాణం పోసింది మనిషిని చేసింది 


ఇప్పుడు తను ఒంటరి
బాధను ,భావాలను పంచుకోలేడు
మళ్ళి ఆలోచించింది ఆ మనసు
అతనికి నిద్ర ,ఈసారి మట్టికాదు
అతనిలోనుంచే తీసాడు ముద్ర 


ఒంటరిని జంటగా చేసిందా చేయి
కలిపింది జంటను మరొక కనుల
పంటకోసం ఈ భూమిని నింపడం కోసం
నింపుతూనే వుంది ఆ జంట ఈ భూమిని
తనను సృష్టించిన ఆ దైవత్వం కోసం

విరహాల వనవాసం                                      నీకేం మత్తు చల్లి పోతావ్ 
                                      విరహాల వనవాసం మాకేగా చందమామ 

అరుణతార


ఆకులన్నీ ఎర్రబడ్డాయి...................
..........
ఓ అరుణతార నేలరాలింది అడివిలో
అలసింది అప్పటివరకు గర్జించిన 
తుపాకీ గొట్టం 
నేలకొరిగింది తుపాకీ తూటా 

నమ్మిన సిద్దాంతం కోసం 
నమ్ముకున్న వాళ్ళను వొదిలి 
అడివి తల్లి ఒడిలో వొదిగిన మానవత్వం 

వస్తుందో రాదో మరి మీరు కోరుకునే
రాజ్యం సామాన్యులకి
మీ ఫోటో మాత్రం ఖచ్చితంగా వస్తుంది
లోన్గిపోతెనో , లేక ఒరిగిపోతెనో అడివిలో

అడివి పూల అంత స్వచ్ఛత మీ ఆశయం
సూరీడు అందరికి వెలుగునిస్తే
మీకు మాత్రం స్ఫూర్తి నిస్తాడు
అరుణ ఉదయమై ప్రతీరోజు

భావాల సంఘర్షణ నిలబడనివ్వదు
పోలీసు తూటా మిమ్మల్ని బతకనివ్వదు
నిత్యం పరుగు విప్లవ భావాలవెంట
తుపాకీ వంటి బతుకును మోస్తూ

గడ్డి పువ్వులాంటి జీవితం
అజ్ఞాతంలో వుండే మీకైనా
బాహ్యంగా వుండే మాకైనా

ప్రతీ సిద్దాంతం రాద్దాంతమే
అది మవోఇజం అయినా
సామ్యవాదం అయినా
ఎవరు నమ్మినా నమ్మకున్న
ఏది ఏమైనా మీరు మాత్రం గొప్పే

తన వాళ్ళకోసం ప్రాణాలు ఇచ్చారు
చరితలో మహానుభావులు
మీకు మాత్రం లేదు బేధం
కులం మతం ప్రాంతీయతత్వం
మీరు ఇస్తే ప్రాణం సకల మానవాళి కోసం
అందుకే కామ్రేడ్ మీకు మా లాల్సలాం

కొత్త వైద్యం

  
                                  అత్తారింటి కొత్త వైద్యం 
                                  కోడలి కన్నీళ్ళకి మందు కట్నం డబ్బులంటా

అలల పోరాటంఎక్కడికో ఎదగాలనే ఆరాటం 
ఎందరికో స్ఫూర్తి నీ ప్రయత్నం 
తీరం పైకి నీ దండయాత్ర అలుపెరుగని 
యోధుడిలా
తీరం అందలేదని ఆవేశపడకు 
నింగి దొరకలేదని తొందరపడకు 
నీటి అణువులన్నీపోగేసి సైన్యం గాచేసి
నువ్వు చేసే నిరంతర యుద్ధం
మానవాళికి నిరంతర పాఠం
సమస్యను ఎదురుకునేందుకు
ఆకాశమే నీ హద్దు దాన్ని ఎప్పుడు చెరపొద్దు
సాగిపో విహంగమై నింగిదాక
చేరుకుంటావు నీ తీరం అనే ప్రేయసిని
నీ నిరంతర అలల ముట్టడిలో