నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Friday, November 30, 2012

ఇద్దరు
కొలతలేసి కట్టిన
నాలుగుమూలల గది లో 
విద్యుత్  దీపాల కాంతులు 
విరజిమ్ముతుంటే 
అక్కడ రెండు దేహాలు 
విశ్రమిస్తుంటాయి రోజూ 

ఒంటికి ప్రేమను పూసుకుని 
మదిలో ప్రేమ ఆలోచనలు 
నింపుకుని రేయి పవలు లో 
ప్రేమ ని నిక్షిప్తం చేసుకుని 
ప్రేమని ఆరాదిస్తుంటాయి  

నిశబ్దంగా సమయాన్ని భోంచేస్తూ 
తీయటి మధువుని పెదాలతో 
మార్చుకుంటూ అమరత్వాన్ని 
అనుభవిస్తాయి ఆ దేహాలు 

పగలంతా అలిసిన దేహాలు 
అక్కడకోచ్చేసరికి మనసుకోసం 
ఆరాట పడతాయి అదేంటో విచిత్రం 
దేహాలు రెండు పక్కనే ఉన్నా 
మనసులే మాట్లాడుకుంటాయి మౌనం గా 
అక్కడి ఊసులు ,శ్వాసలు వారికే సొంతం 

శరీరంతో పడ్డ కష్టాన్ని మనసుతో 
తెలికచేసుకునే ఓ యోగ ప్రక్రియ 
అక్కడ ఆ జంటకే తెలుసు 
నిషిద్దాజ్ఞలు లేని ఒక స్వేచ్చా 
ప్రపంచంలో విహరిస్తుంటారు 

అదో లోకం కలల ప్రపంచం 
ఆ దేహాలకి ఆ రెండు 
మస్తిష్కాలలో  రెక్కలు 
విచ్చుకున్న ఆలోచనలు 
అక్కడ వికసిస్తుంటాయి కొన్ని 
రాలిపోతుంటాయి మరికొన్ని 
ఫలాలు అవుతాయి 
వారి జీవితాలని ఫలభరితం చేస్తూ

Tuesday, November 27, 2012

మరో మార్చ్
ఉబ్బిన నరం 
బిగిసిన పిడికిలి 
గర్జించే గొంతుక 
కదం తొక్కే పాదం 
ఘల్లున మోగే అందెలు 
రణ  నినాదాలు 
విప్లవ గీతాలు 
తప్పెట గుళ్ళు 
ఏవి ఎక్కడా ఆ అరుణ కాంతి 
రెపరెపలు 
పాత తరం నెత్తురు ఇంకిపోయి 
వెలిసిన అరుణ పతాకం 
శిఖరాగ్రాన నిలపాలంటే 
కుత్తుకలు తెన్చుకుంటూ 
నూతన తరం లేవాలి 

ప్రచండ సంవర్తనాలు రావాలి 
ఎర్రని భావాలు ప్రసరించాలి 
మరో మార్చ్ కి సన్నద్ధం కావాలి 
యువ తరం ఉదయిస్తున్న సూర్యులై

Friday, November 2, 2012

వార్ధక్యంఈ జీవితం పై , సమాజం పై 
సంధించాలనుకున్న శరాలెన్నో 
నా  ఆలోచన అమ్ముల పొదిలో 

ఇంకిపోయిన కన్నీళ్ళు ఎన్నో నా  కళ్ళలో 
ముఖంపై ముడతలు నేను  దాటొచ్చిన
కష్టాల తాలూకు మలుపుల్ని జ్ఞప్తికి తెస్తూ 

ఒకప్పటి  వయసులో 
నేనూ ఏపుగానే పెరిగా  చెట్టులా
అన్ని కాలాలకి స్పందించా 
కాయలు కాసాను 
పూవులు పూసాను
 గాలికి వుగాను 
ఇప్పుడు అవసరం తీరింది
ఈ మోడులాగే  నేను 
ఒంటరిగా మిగిలాను చివరికి 

ఎంత ఆలోచిస్తుందో  మెదడు 
ఏమాత్రం  సహకరించాకుంది  దేహం 
వార్ధక్యం మనసుకి పట్టేసింది 
అదో మనో వైకల్యం ఏమో 
ఇప్పటిదాకా నా వారు ఇప్పటి 
నుండి పరాయి వారు 
అవుతున్న ఈ  తరుణం 
హతోస్మి ! ఏంటో ఈ జీవితం 

ఓడినట్టో   గెలిచినట్టో  తెలీని 
సందిగ్దావస్థలో రాలబోతున్న ఓ పత్రం నేను 
కాని నేను ఖచ్చితంగా చెప్పగలను 
ఒక భవితకు పరచిన బాట నేను 
కొన్ని  కలల కు కారణం నేను 
కొన్ని ప్రశ్నలకు సమాధానం 
చెప్పగల జవాబు నేను 
కేవలం నేనూ మాత్రమే 
ప్రశ్నించగల ప్రశ్న నేను
చివరికి నేనులా మిగిలే నేను