నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Monday, April 23, 2012

నా ఆశగతం.......
నీ నవ్వులలో నా ప్రపంచాన్ని మరిచిపోయాను 
నీ నడకలలో నా అడుగులు వేయడం తడబడ్డాను 
నీ చూపులు నా చూపులలో చిక్కుకుంటే నేను చిక్కిపోయాను 
నీ చేతి స్పర్స తో నా మేను పులకించింది 

ప్రస్తుతం ..................
నీ కను చూపు సోకక నా కన్నీళ్ళలో నీ రూపం కరిగి పోయింది 
నీ నిషక్రమణ అడుగుల శబ్దం లో నా ఆశ కొట్టుకుపోయింది 
నీ చేయి నన్ను వదిలిన క్షణం నా మేను మ్రాన్పడి పోయింది 
నీవు వదిలి వెళ్ళిన నా హృదయం వేదనతో బరువెక్కింది 
నీవే ఆశగా బ్రతుకుదామనే నా ఆశ అడి ఆశే ఐంది 
నీ ధ్యాసలోనే ఆశగా బ్రతుకుతున్నాను 
నీ జ్ఞాపకాలలో నేను ఉంటానని ఆశిస్తూ బతుకుతున్నాను   

No comments:

Post a Comment