నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Friday, November 30, 2012

ఇద్దరు
కొలతలేసి కట్టిన
నాలుగుమూలల గది లో 
విద్యుత్  దీపాల కాంతులు 
విరజిమ్ముతుంటే 
అక్కడ రెండు దేహాలు 
విశ్రమిస్తుంటాయి రోజూ 

ఒంటికి ప్రేమను పూసుకుని 
మదిలో ప్రేమ ఆలోచనలు 
నింపుకుని రేయి పవలు లో 
ప్రేమ ని నిక్షిప్తం చేసుకుని 
ప్రేమని ఆరాదిస్తుంటాయి  

నిశబ్దంగా సమయాన్ని భోంచేస్తూ 
తీయటి మధువుని పెదాలతో 
మార్చుకుంటూ అమరత్వాన్ని 
అనుభవిస్తాయి ఆ దేహాలు 

పగలంతా అలిసిన దేహాలు 
అక్కడకోచ్చేసరికి మనసుకోసం 
ఆరాట పడతాయి అదేంటో విచిత్రం 
దేహాలు రెండు పక్కనే ఉన్నా 
మనసులే మాట్లాడుకుంటాయి మౌనం గా 
అక్కడి ఊసులు ,శ్వాసలు వారికే సొంతం 

శరీరంతో పడ్డ కష్టాన్ని మనసుతో 
తెలికచేసుకునే ఓ యోగ ప్రక్రియ 
అక్కడ ఆ జంటకే తెలుసు 
నిషిద్దాజ్ఞలు లేని ఒక స్వేచ్చా 
ప్రపంచంలో విహరిస్తుంటారు 

అదో లోకం కలల ప్రపంచం 
ఆ దేహాలకి ఆ రెండు 
మస్తిష్కాలలో  రెక్కలు 
విచ్చుకున్న ఆలోచనలు 
అక్కడ వికసిస్తుంటాయి కొన్ని 
రాలిపోతుంటాయి మరికొన్ని 
ఫలాలు అవుతాయి 
వారి జీవితాలని ఫలభరితం చేస్తూ

2 comments: