నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, November 27, 2012

మరో మార్చ్
ఉబ్బిన నరం 
బిగిసిన పిడికిలి 
గర్జించే గొంతుక 
కదం తొక్కే పాదం 
ఘల్లున మోగే అందెలు 
రణ  నినాదాలు 
విప్లవ గీతాలు 
తప్పెట గుళ్ళు 
ఏవి ఎక్కడా ఆ అరుణ కాంతి 
రెపరెపలు 
పాత తరం నెత్తురు ఇంకిపోయి 
వెలిసిన అరుణ పతాకం 
శిఖరాగ్రాన నిలపాలంటే 
కుత్తుకలు తెన్చుకుంటూ 
నూతన తరం లేవాలి 

ప్రచండ సంవర్తనాలు రావాలి 
ఎర్రని భావాలు ప్రసరించాలి 
మరో మార్చ్ కి సన్నద్ధం కావాలి 
యువ తరం ఉదయిస్తున్న సూర్యులై

2 comments:

  1. ప్రజలకు న్యాయం మాట దేవుడు ఎరుగు, ప్రజలకు అన్యాయం, నష్టం జరగకుండా ఉంటే చాలు.

    ReplyDelete
    Replies
    1. అలా ప్రజలకి న్యాయం జరగాలంటే అరుణ యువ తారలు రావాల్సిందే సర్

      Delete