నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Monday, October 15, 2012

"కవిత్వం కావాలి కవిత్వం "పూలపల్లకి మేనా 

ఒంటినిండా మేలిమి సోనా 
కళ్యాణ భట్టుల జయజయ ధ్వానాలు 
నిలువెత్తు విగ్రహాలు ,తైల వర్ణ చిత్రాలు .
పూమాలలు , రత్నరాసులు 
రత్నఖచిత సింహాసనం 
వజ్రమొన ఘంట లిఖిత 
సువర్ణ ప్రశంసా పత్రం 
మెచ్చుకోళ్ళు ,వీరతాళ్ళు 
దిగ్దిగంతాల ఖ్యాతి ....................
కుక్కి మంచంపై  నిద్రిస్తున్న నాకో కల 
కల సాకారం కావాలంటే నేను కవిని కావాలి 
"కవిత్వం కావాలి కవిత్వం "
కల నిజం కావాలి నేను కవిని కావాలి 
కవికి కవిత్వానికి పూర్వ వైభవం తేవాలి 

No comments:

Post a Comment