నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, July 28, 2012

జీవితం ఒక ప్రయాణం

రైలు బండి  బయలు దేరింది 
ఎంతో మంది జనాలు 
అందరివి వేరు వేరు ఆలోచనలు 
వృత్తులు, ప్రవృత్తులు 
అందులో నేను ఒకడిని 

కిటికీ లోనుంచి అందమయిన దృశ్యాలు 
అప్పుడే చీకట్లోనుంచి వస్తున్న సూరీడు  
పిలిచిన గాలి ని  తలవూపి పలకరించే పైర్లు 
అప్పుడప్పుడు చుట్టాల్లా వచ్చి పలకరించే 
పోయే స్టేషన్లు 
కోనసీమ అందాలు కన్నెపిల్లను 
జ్ఞప్తికి తెచ్చేస్తున్నాయి 

అప్పుడప్పుడు కళ్ళు ముసేసా 
తలదిన్చేసా రైలు కట్ట పక్కన 
నిలబడ్డ భారత స్త్రీ  జాతిని చూసి 
ఎదిగిన దేశ భవిత ఇంతేనా అని 

ఇవేమీ తనకి పట్టనట్టు 
నిండు  పుష్పక విమానం లా  పోతూనే వుంది రైలు 
వందల జీవితాలను తన చక్రాలపై మోస్తూ 
పాత ప్రయాణీకులను దింపేస్తూ 
కొత్తవారిని తనలోకి ఆహ్వానిస్తూ 
జీవితమూ  ఇంతేనేమో 
అన్ని చూసేస్తుంది , చూపిస్తుంది 
మళ్లీ తన యాత్ర తానూ చేస్తూనే వుంటుంది   

గోదారి గలగల లను గుండె నిండా నింపుకుని 
కోనసీమ తీపి జ్ఞాపకాలను మూటకట్టుకుని 
మళ్లీ రైలెక్కాను అదే అనుభూతి 
మారదేమో అది నా జీవితం లానే 
జీవితం ఒక ప్రయాణం 


No comments:

Post a Comment