నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, July 11, 2012

సృష్టి కార్యం

ఒక శూన్యం వివస్త్రగా 
రంగులేమీ నింపుకొని లోకం 
అమాయకంగా వుంది 
నిశబ్దం లోనుంచి లేచిన ఒక చేయి 
లోకాన్ని నిమిరింది ,రెండుగా చేసింది 
భూమి, ఆకాశం అని పేరు పెట్టింది 

అంతా చీకటి బిలం,ఎక్కడ కూడాలేదు
ఎగిరేందుకు ఒక్క గబ్బిలం 
ఈసారి నోరు మాట్లాడింది 
చీకటిని చింపి వేరుచేసి లోకానికి 
వెలుగు పంచింది 

అక్కడనుండి ప్రతీరోజు ఒక చర్య
నీరు, గాలి,సూర్య చంద్రులు
తారలు ,తారాలోకం
ఎన్నో ప్రాణులు ,మరెన్నో జీవులు
చెట్టులు,పుట్టలు ,పంచ భూతాలూ 


ఇప్పుడు అంతా ప్రక్రుతి మయం
అంతలోనే ఎంత మార్పు
ఏడు రోజుల్లో ఎన్నో వింతలు
ఇదంతా ఎవరికోసం అనుకుంది
ఆ మనసు అంతే
ఒక సృష్టి కి అసలైన ఆరంభం ఇక్కడే
మట్టి మెత్తగా ఆ చేతుల్లో ఒదిగింది
తన రూపం ఇంకో రూపానికి
మూలం అవుతుంది అని 


ఆ రూపం ఒక దివ్యస్వరూపాన్ని పోలివుంది
ఇప్పటికి ఆ మట్టి ఒక మట్టి ముద్దే
తన ఆత్మను అందులోకి ఊదింది
ప్రాణం పోసింది మనిషిని చేసింది 


ఇప్పుడు తను ఒంటరి
బాధను ,భావాలను పంచుకోలేడు
మళ్ళి ఆలోచించింది ఆ మనసు
అతనికి నిద్ర ,ఈసారి మట్టికాదు
అతనిలోనుంచే తీసాడు ముద్ర 


ఒంటరిని జంటగా చేసిందా చేయి
కలిపింది జంటను మరొక కనుల
పంటకోసం ఈ భూమిని నింపడం కోసం
నింపుతూనే వుంది ఆ జంట ఈ భూమిని
తనను సృష్టించిన ఆ దైవత్వం కోసం

No comments:

Post a Comment