నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Friday, November 2, 2012

వార్ధక్యంఈ జీవితం పై , సమాజం పై 
సంధించాలనుకున్న శరాలెన్నో 
నా  ఆలోచన అమ్ముల పొదిలో 

ఇంకిపోయిన కన్నీళ్ళు ఎన్నో నా  కళ్ళలో 
ముఖంపై ముడతలు నేను  దాటొచ్చిన
కష్టాల తాలూకు మలుపుల్ని జ్ఞప్తికి తెస్తూ 

ఒకప్పటి  వయసులో 
నేనూ ఏపుగానే పెరిగా  చెట్టులా
అన్ని కాలాలకి స్పందించా 
కాయలు కాసాను 
పూవులు పూసాను
 గాలికి వుగాను 
ఇప్పుడు అవసరం తీరింది
ఈ మోడులాగే  నేను 
ఒంటరిగా మిగిలాను చివరికి 

ఎంత ఆలోచిస్తుందో  మెదడు 
ఏమాత్రం  సహకరించాకుంది  దేహం 
వార్ధక్యం మనసుకి పట్టేసింది 
అదో మనో వైకల్యం ఏమో 
ఇప్పటిదాకా నా వారు ఇప్పటి 
నుండి పరాయి వారు 
అవుతున్న ఈ  తరుణం 
హతోస్మి ! ఏంటో ఈ జీవితం 

ఓడినట్టో   గెలిచినట్టో  తెలీని 
సందిగ్దావస్థలో రాలబోతున్న ఓ పత్రం నేను 
కాని నేను ఖచ్చితంగా చెప్పగలను 
ఒక భవితకు పరచిన బాట నేను 
కొన్ని  కలల కు కారణం నేను 
కొన్ని ప్రశ్నలకు సమాధానం 
చెప్పగల జవాబు నేను 
కేవలం నేనూ మాత్రమే 
ప్రశ్నించగల ప్రశ్న నేను
చివరికి నేనులా మిగిలే నేను 

No comments:

Post a Comment