నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Thursday, October 18, 2012

ఏకాంతం

ఘనీభవించని కాలాన్ని పట్టుకోవాలని 
నిశబ్దంగా పనిచేసుకుపోయే క్షణాలని 
నా వైపు తిప్పుకోవాలని ఎంతో ఆశ

అచేతనంగా ఉన్నాసరే మనసు కుదురుకోదు 
ఏదో ఒక తలపు  మది తలుపు తడుతుంది 
మళ్లీ అలజడి మొదలు ఓహ్ ఏంటో ఈ నరకం 
ఏకాంత లేకుండా 

నా గుండె చప్పుడు నాకే వినిపించేంత దగ్గరగా 
ఉండాలనుకుంటా కాని 
నిశబ్దం పై శబ్దం పెత్తనం చేస్తూ పరిహసిస్తుంది 
ఎంత మొత్తుకున్నా ఏం లాభం అప్పటికే 
నిశబ్దం చచ్చిపోతుంది ఏకాంతాన్ని నాకు 
అందివ్వకుండానే 

ఏకాంతం అందరికి దొరకని సొత్తు 
దొరికినట్టే  దొరికి పారిపోయే పాపాయి  
త్రుటిలో చేజారే అదృష్టం 
వేటాడగా వేటాడగా దొరికే నిధి 
దొరికినప్పుడు ఒడిసి పట్టుకుంటే ధన్యం
లేకుంటే ఏముంది మళ్లీ దొరికేవరకు వేట 
ప్చ్ ఏకాంతం ఏకాంతం ఏకాంతం .....
................................................. 
                                       

No comments:

Post a Comment