నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, September 4, 2012

ఎన్నో ఊహలు

ఎన్నో ఊహలు 
మది ఊహించడం మొదలెట్టినప్పటినుండి
అందమైన ఊహలు కొన్ని 
భయపెట్టిన ఊహలు కొన్ని 
ఊరించిన ఊహలు కొన్ని 
పిచ్చి పట్టించిన ఊహలు కొన్ని 

ఊహించకూడని ఊహలు ఊహిస్తూ 
భయపడిన ఊహలు కొన్ని 
ఊహించ వలసిన ఊహలు 
ఊహించకుండా ఓడిన ఊహలు కొన్ని 

బాల్యం లో పెద్దవాడిని కావాలని 
పెద్దయ్యాక బాల్యం లో కి వెళ్ళాలని 
ఎదగడానికి ఎందుకో ఊహకి అంత తొందర 

కలల లోకం లో ఊహల ఊయల 
ఊగుతూ కాలం గడిపేస్తే 
ఊయల ఊది పడితే వాస్తవం నొప్పిలా 
వెంటాడుతుంది 

భయాల బందిఖానాలో గడిపేస్తూ 
నిర్భీతి ఊహను తలుచుకోకుంటే 
భయం అనే ఊహే వురి తాడులా 
ఉసురు తీస్తుంది 

వయసుతో   పాటు  పెరిగిన ఊహలు 
మనసు మాట వినకపోతే 
ఊహలు నిన్ను ఊరేగించి 
చివరకు ఉత్సవ విగ్రహాన్ని చేస్తాయి 

ఊహ  అందమైనదే 
ఊహ అందని ద్రాక్ష 
వాస్తవం చేతికందిన ఫలం 
అందని ద్రాక్షని ఊహిస్తే
వాస్తవం అనే ఫలం పాడై
వాస్తవం  కూడా ఊహలానే మిగుల్తుంది 

4 comments:

 1. మొత్తానికి ఊహలకి రెక్కలొచ్చినా కాస్త చూస్కుని ఎగరాలంటారు.. అంతేనా? బాగుందండి.

  ReplyDelete
 2. అంతే కదండీ మరి ఊహలోనే
  చాలా కాలం బతికేస్తాం తరవాత కాని తెలీదు అది ఎంత నష్టమో

  ReplyDelete
 3. ఊహల గురించి ఊహించని విధంగా వ్రాశారు. అనూహ్యంగా ఉంది:)

  ReplyDelete
 4. ధన్యవాదాలు రసజ్ఞ గారు

  ReplyDelete